ఇండో-అమెరికన్ వాణిజ్య నిపుణుల సమావేశం
గడిచిన రెండు దశాబ్దాల్లో ఇండియా-అమెరికా వాణిజ్యం 8 రెట్లు పెరిగిందని హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ వైవాన్ గుయిలామ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండో-అమెరిన్ వాణిజ్య నిపుణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయులు యూఎస్‌లో 12.7 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడి పెట్టారని, రెండు దేశాల మధ్య ప్రస్తుతం 159 బిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం సాగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు అత్యుత్తమంగా పని చేస్తున్నారన్నారు. రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య, ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ జాతీయ అధ్యక్షుడు కపిల్కౌల్, ఇరు దేశాల వాణిజ్య నిపుణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.






