అగ్రరాజ్యం అమెరికాతో భారత్ చర్చలు
దేశ సరిహద్దులు, సముద్ర తీరం వెంబడి నిఘా కోసం అత్యాధునిక 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు భారత్ అగ్రరాజ్యం అమెరికాతో జరుపుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ డీల్ విలువ సుమారు రూ.23,977 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించారు. ఎంక్యూ-9బీ డ్రోన్లు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ), సముద్ర తీర ప్రాంతలో నిఘా, జలాంతర్గాముల దాడులను గుర్తించడం, స్థిరమైన భూ లక్ష్యాలను చేధించడం వంటి వివిధ ప్రాతాలు నిర్వర్తించగలవు, గతనెల కాబూల్‌లో అల్ కాయిదా నేత జవహరిని హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన ఎంక్యూ`9 డ్రోన్‌కు ఈ ఎంక్యూ`9బీ డ్రోన్ మరింత అధునాతన వెర్షన్.






