India : అక్టోబర్ నాటికి ఇండియా అమెరికా ట్రేడ్ డీల్

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సెప్టెంబర్- అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ (Sunil Barthwal) తెలిపారు. అమెరికాలో వాణిజ్య ఒప్పందం కోసం భారత్ (India) ఇప్పటికే పలు మార్లు చర్చించిందని తెలిపారు. ఈ చర్యలు కొనసాగుతున్నాయని సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ఒక కొల్కి వచ్చి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం భారత్‌లో వాణిజ్య డీల్‌పై చర్చించేందుకు ఈనెల 25న రానుంది. భారత్‌పై 50 శాతానికి సుంకాలు పెంచిన ట్రంప్ తదుపరి వాణిజ్య చర్చలు ఉండవని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధి బృందం వస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. అయితే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Besant) మాట్లాడుతూ భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షి వాణిజ్య ఒప్పందం కుదిరే అవకావం ఉందని ఆయన కూడా అశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం, డైయిరీ, ఆటో కంపోనెంట్స్ (Auto Components) విషయంలో భారత్ వెనక్కి తగ్గడం లేదని ఆయన చెప్పారు.