రూ.22,000 కోట్ల ప్రతిపాదనకు త్వరలోనే ఆమోదం
త్వరలో అమెరికా నుంచి కీలకమైన ప్రిడేటర్ రకం డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. చాలా కాలం నుంచి పెండిరగ్లో ఉన్న ఈ ప్రతిపాదనకు భారత్ ఆమోదం తెలపనుందని సమాచారం. 30 ప్రిడేటర్ డ్రోన్లకు దాదాపు రూ.22 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎంక్యూ`9బీ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) కొద్ది వారాల్లోనే క్లియరెన్స్ ఇస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని అధ్యక్షతన జరిగే రక్షణ రంగ కేబినెట్ కమిటీ ముందు ఈ క్లియరెన్స్‌ను ఉంచనున్నారు. భారత నావికా దళం, వాయుసేవ, ఆర్మీ విభాగాలకు 10 చొప్పున డ్రోన్లను ఇవ్వనున్నారు. డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనను డీఏసీ ముందు అతి త్వరలో ఉంచనున్నట్లు వైస్ చీఫ్ ఆఫ్ నావాల్ స్టాఫ్, వైస్ అడ్మిరల్ సతీశ్ నమ్‌దేవ్ వెల్లడిరచారు. వచ్చే నెల వాషింగ్టన్లో భారత్, అమెరికా మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉంది.






