ఇదే మొదటిసారి.. ఇరాన్ తో భారత్ ఒప్పందం

ఇరాన్‌లోని వ్యూహాత్మకంగా ముఖ్యమైనదైన ఛబాహర్ పోర్టు టెర్నికల్ నిర్వహణకు సంబంధించి 10 సంత్సరాల ఒప్పందంపై భారత్, ఇరాన్ సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో వాణిజ్య బంధాలతో పాటు ప్రాంతీయ అనుసంధానతకు ఊతం లభించనున్నది. ఒక విదేశీ పోర్టు నిర్వహణకు భారత్ చేపట్టడం ఇదే మొదటిసారి. పొరుగుదేశమైన పాకిస్థాన్‌ను పక్కన పెట్టి భారత్,చైనా, అప్ఘానిస్తాన్ మధ్య నేరుగా వాణిజ్య బంధం పెంపునకు ఇది దోహదపడనున్నది. రేవులు, షిస్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఇండియా పోర్ట్సు గోలబల్ లిమిటెడ్ (ఐపిజిఎల్), ఇరాన్ పోర్టు అండ్ మారీటైమ్ ఆర్గనైజేషన్ (పిఎంఓ) మధ్య ఒప్పందం కుదిరినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.