Apple: చైనాకు షాక్ ఇచ్చిన యాపిల్… భారత్‌లో ఐఫోన్ల తయారీ

అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) తన ఐఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల తయారీకి మనదేశంలోని కేంద్రాలను మరింతగా వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), వివిధ దేశాలపై సుంకాలను ఏప్రిల్ (April) నుంచి అమలు చేస్తామని ప్రకటించడం తో, మార్చి ఆఖరు నుంచే భారత్ (India) నుంచి భారీఎత్తున ఐఫోన్లు, ఇతర పరికరాలను యాపిల్ (Apple) అమెరికాకు తరలించిందని సమాచారం. ఒక్కోటి 100 టన్నుల సరకును చేరవేయగల 6 విమానాలు (Flights) , భారత్ నుంచి అమెరికా ఐఫోన్లను తీసుకెళ్లాయని విశ్వసనీయంగా తెలిపింది. ఇప్పుడు భారత్‌పై 10 శాతం నుంచి విధించినా, 26 శాతం సుంకాన్ని అమెరికా జులై 9 వరకు వాయిదా వేసింది. ఇదే సమయంలో చైనాలో తయారైన ఉత్పత్తులపై మాత్రం145 శాతం సుంకాన్ని అమల్లోకి తెచ్చింది. ఐఫోన్ల తయారీకి ప్రధాన కేంద్రంగా ఇప్పటివరకు చైనా ఉండగా, తాజా పరిణామంతో ఐఫోన్ తయారీ అంటే ఇండియానే అనేలా పరిస్థితి మారొచ్చనే అంచనాలూ వెలువడుతున్నాయి.