శుభవార్త చెప్పిన ఐసీఐసీఐ
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మరి. దీని ప్రభావం నేపధ్యంలో వివిధ రంగాలు, సంస్థలతో పాటు ఇటు ఉద్యోగులు సైతం నానా అవస్థలు పడుతోన్న విషయం తెలిసిందే. అయితే ఇంత కష్టకాలంలో కూడా ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తన ఉద్యోగులకు వేతనాలను పెంచడం విశేషం. దేశంలో ప్రైవేటు రంగంలో రెండవ అతి పెద్ద బ్యాంకుగా ఉన్న ఐసీఐసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర బ్యాంకులు, వాణిజ్యవర్గాలు నివ్వెరపోయాయి. కరోనా సంక్షోభంలో కూడా అందించిన సేవలు గుర్తిస్తూ ఉద్యోగులకు వేతనాలను పెంచినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు ఎనిమిది శాతం మేరకు వేతనాల్లో పెంపు ఈ నెల(జులై) నుంచి అమలవుతుంది.






