రానున్న రోజుల్లో మరిన్ని లేఆఫ్ లు : సుందర్ పిచాయ్

గూగుల్‌లో 2024 ప్రారంభం నుంచి వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇది మరింతగా కొనసాగుతుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఆయన ఉద్యోగులతో నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. 2023లో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంవత్సరం మాత్రం దఫదఫాలుగా ఉద్యోగులను తొలగిస్తోంది. ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అన్న అనిశ్చితిలో చాలా డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులు ఊగిసలాడుతున్నారని, లేఆఫ్‌లు ఎంతకాలం సాగుతాయని జరిగిన సమావేశంలో సుందర్ పిచాయ్‌ను కొందరు ప్రశ్నించారు. 2024 మొదటి ఆరు నెలలకాలంలో ఎక్కువ మంది లేఆఫ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండో అర్థ సంవత్సరంలో ఈ సంఖ్య తక్కువగానే ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం రిక్రూట్‌మెంట్ విషయంలో గూగుల్ చాలా క్రమశిక్షణతో వ్యవరిస్తుందని తెలిపారు. రిక్రూట్‌మెంట్స్ చాలా తక్కువగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.