ఉద్యోగులకు హెచ్‌సీఎల్ భారీ షాక్!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. హెచ్‌సీఎల్ సంస్థ మైక్రోసాఫ్ట్ న్యూస్ విభాగానికి చెందిన ప్రొడక్ట్‌పై వర్క్ చేస్తోంది. ఈ తరుణంలో ఆ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌లపై వర్క్ చేస్తున్నాం. భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్ట్‌లపై వర్క్ చేయబోతున్నామనే అంశాలపై చర్చించేందుకు హెచ్‌సీఎల్ ఉద్యోగులతో టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించింది. ఆ సమావేశంలో ఉద్యోగుల తొలగింపులపై ప్రకటన చేసినట్లు సమాచారం. హెచ్‌సీఎల్ తొలగించిన ఉద్యోగులు భారత్, గ్వాటెమాల, ఫిలిప్పీన్స్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు నివేదిక వెల్లడిరచింది.






