గూగుల్ పే బ్యాన్ పై ఎన్పీసీఐ క్లారిటీ
భారత్‌లో గూగుల్ పే యాప్‌ను ఆర్బీఐ బ్యాన్ చేసిందంటూ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎన్పీసీఐ స్పందిస్తూ గూగుల్ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్ చేయలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సృష్టం చేసింది. అంతకు క్రితం గూగుల్ పే లావాదేవీలపై వచ్చిన పుకార్లపై సంస్థ సృష్టత నిచ్చింది. గూగుల్ పే యాప్ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని తేల్చి చెప్పింది. తమ యాప్ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది. గూగుల్ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవీ పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది.






