Google : గూగుల్‌లో మళ్లీ లేఆఫ్‌లు.. వందలాది మందిపై వేటు!

టెక్ దిగ్గజం గూగుల్(Google) మరోమారు లేఆఫ్‌ల ప్రక్రియ చేపట్టింది. తమ ప్లాట్‌పామ్(Platform), డివైజ్ యూనిట్ల (Device unit )లో పనిచేసే వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ (Android software), పిక్సెల్ ఫోన్లు(Pixel phones), క్రోమ్ బ్రౌజర్ల (Chrome browsers) లో పనిచేసే ఉద్యోగుల పై ఈ వేటు పడినట్లు తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎంతమందిని తొలగించారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా గత రెండేళ్లలో గూగుల్ అనేక మందిని విధుల నుంచి తప్పించింది. గతేడాది డిసెంబరులో మేనేజర్, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10 శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించింది. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌ఆర్ విభాగం, క్లౌడ్ ఆర్గనైజేషన్‌లో కొంతమందిని తొలగించింది. ఖర్చు తగ్గింపులో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.