మంచి ఫలితాలు చూపకుంటే… త్వరలో తొలగింపులు!
గూగుల్ ఉద్యోగుల్లో తొలగింపు గుబులు నెలకొన్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టాయి. తాజాగా గూగుల్ కూడా తన ఉద్యోగులకు ఇదే విధమైన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తున్నది.
ఉద్యోగులు తమ పనితీరు మెరుగుపర్చుకోకపోతే, వచ్చే త్రైమాసికంలో మంచి ఫలితాలు కనిపించుకుంటే తొలగింపులకు సిద్ధంగా ఉండాలని గూగుల్ ఎగ్జిక్యూటివ్స్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. సేల్స్ ప్రొడక్టివిటీతో పాటు మొత్తం ఉత్పాదకతను కంపెనీ పరిశీలించనున్నదని, రాబోవు త్రైమాసికంలో మంచి ఫలితాలు కనిపించకుంటే తొలగింపులు ఉంటాయని హెచ్చరికలు వచ్చాయని గూగుల్ క్లౌడ్ సేల్స్ డిపార్ట్మెంట్లో పని చేసే పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. కొత్త నియామకాల నిలుపుదలను గూగుల్ ఎటువంటి ప్రకటన లేకుండా పొడిగించిన నేపథ్యంలో ఉద్యోగుల్లో తొలగింపు ఆందోళన నెలకొన్నది.






