Cognizant: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కాగ్నిజెంట్

ప్రముఖ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ (Good news) చెప్పింది. 80 శాతం మంది అర్హులైన ఉద్యోగుల (Employees) కు వేతనాలు పెంచనున్నట్లు ప్రకటించింది. రెండో త్రైమాసిక ఆదాయాలపై ప్రకటన సందర్భంగా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రతిభ ఆధారంగా 80 శాతం అర్హులైన ఉద్యోగులకు జీతాలు (Salaries) పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ పెంపు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ జీతాల పెంపు సీనియర్ అసోసియేట్ (Senior Associate) స్థాయి హోదా వరకూ ఉంటుందని తెలిపింది. అయితే, ఎంత మొత్తంలో హైక్ ఉంటుందన్నది మాత్రం వెల్లడించలేదు. ఉద్యోగి పనితీరు, వచ్చిన రేటింగ్ ఆధారంగా నిర్ణయించనున్నట్లు స్పష్టం చేసింది.