ముకేశ్ అంబానీకి షాక్.. గౌతమ్ అదానీకి అగ్రస్థానం

అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ దేశంలో అత్యంత శ్రీమంతుడి స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరులతో రూపొందించిన బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అదానీ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ జాబితాలో అంతర్జాతీయంగా గౌతమ్ అదానీ 12వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం నికర సంపద విలువ 97.6. బిలియన్ డాలర్లు. ముకేశ్ అంబానీ 97 బిలియన్ డాలర్ల సంపదతో 13వ ర్యాంకు పొందారు. ఈ జాబితాలో ఈ ఇద్దరు కుబేరులు స్థానాలు మెరుగవ్వడం గమనార్హం. గతేడాది డిసెంబరులో అంతర్జాతీయంగా అదానీ 16వ స్థానంలో ఉన్నారు.