కీలక పదవిని చేపట్టనున్న ఉర్జిత్ పటేల్
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గర్నవర్ ఉర్జిత్ పటేల్ దేశ ప్రధాన ఆర్థిక థింక్ ట్యాంక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ)కి చైర్మన్గా నియమితులయ్యారు. నాలుగేళ్ల పాటు బాధ్యతలను నిర్వహిస్తారని ఎన్ఐపీఎఫ్పీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ పదవీ విరమణ చేసిన దాదాపు 18 నెలల తరువాత మరో ఆర్థిక సంస్థ కీలక బాధ్యతలను చేపట్టడం విశేషం. దాదాపు ఆరేళ్లపాటు ఎన్ఐఎఫ్పీకి అధ్యక్షత వహించిన విజయ్ లక్ష్మణ్ కేల్కర్ స్థానంలో జూన్ 22, 2020 నుంచి ఉర్జిత్ పటేల్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆర్బీఐ గవర్నర్ గా పదవీకాలం ముగియకముందే డిసెంబర్ 10, 2018న ఉర్జిత్ పదవికి రాజీనామా చేశారు. తన మూడేళ్ల పదవీకాలం 2019 సెప్టెంబర్లో ముగిసేలోపే వ్యక్తిగత కారణాల పేరుతో పదవి నుంచి ఆయన వైదొలగిన సంగతి తెలిసిందే.






