Flipkart :గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. 2 లక్షలకుపైగా

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) శుభవార్త చెప్పింది. రానున్న పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. తన వార్షిక మెగా సేల్ ది బిగ్ బిలియన్ డేస్ (The Big Billion Days) కోసం దేశవ్యాప్తంగా కొత్తగా 2 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 27న వినాయక చవితి (Vinayaka Chavithi) , సెప్టెంబరు 22 నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత దసరా (Dussehra) , దీపావళి (Diwali ) ఇలా వరుస పండుగలు ఉన్నాయి. ఏటా పండుగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. పండుగ సీజన్‌లో తక్కువ ధరకే పలు వస్తువులను సేల్‌కు పెడుతుంది. దీంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తుంటాయి. వాటిని కస్టమర్లకు సకాలంలో డెలివరీ చేసేందుకు మానవ వనరులు అవసరం ఏర్పడుతుంది.
అందుకోసం ఏటా పండుగల సీజన్‌లో ఉద్యోగాలను భర్తీ చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా దాదాపు 28 రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. 2.2 లక్షల సీజనల్ ఉద్యోగఅవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది.