India :భారత్ నుంచి చైనాకు … 2021 తర్వాత తొలిసారి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు భారత్-`చైనాను వ్యాపార పరంగా దగ్గర చేస్తున్నాయి. రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లపై ఆయన పెనాల్టీ, టారిఫ్ విధించడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భారత్‌లోని నయార ఎనర్జీ పై ఐరోపా సమాఖ్య దేశాలు ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం బీజింగ్ (Beijing)ను ఎంచుకొంది. 2021 తర్వాత తర్వాత తొలిసారి ఈ సంస్థ తన డీజిల్ షిప్‌మెంట్‌ను చైనా (China)కు తరలించింది.
నయార ఎనర్జీ లో 49 శాతం వాటా రష్యా పెట్రోలియం దిగ్గజం రోస్‌నెఫ్ట్‌కు ఉంది. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలకు భయపడి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ దానికి డేటా సేవలను నిలిపివేసింది. దీనికి తోడు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా సేవలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో నయార ఈఎం జెనిత్ నౌక 4,96,000 బ్యారెళ్ల అల్ట్రా లో సల్ఫర్ డీజిల్‌తో జులైన 18న చైనాకు బయల్దేరింది. వాస్తవంగా ఇది మలేసియాకు చేరుకోవాల్సి ఉండగా, ఐరోపా సమాఖ్య ఆంక్షలను విధించడంతో మలక్కా జలసంధిలో మార్గం మళ్లించుకొంది. తాజాగా చైనాలోని జౌషాన్ రేపు దిశగా ప్రయాణిస్తోందని తెలిసింది.