ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాంలకు అంతరాయం

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, థ్రెడ్స్, మెసెంజర్‌లకు మంగళవారం సాయంత్రం తీవ్ర అంతరాయం కలిగింది. మెటాకు చెందిన ఈ సామాజిక మాధ్యమ వేదికలన్నీ మూగబోయాయి. పలు దేశాల్లో ఈ ప్లాట్‌ఫాంలకు లాగిన్ సమస్యలు వచ్చాయని లండన్ కేంద్రంగా పని చేసే నెట్ బ్లాక్స్ వెల్లడిరచింది. సమస్యను గుర్తించామని, వెంటనే సరిదిద్దామని మెటా కమ్యూనికేషన్స్ అధిపతి ఆండీ స్టోన్ తెలిపారు.