గుజరాత్ లోనే అమెరికాకు చెందిన అగ్రగామి సంస్థ.. 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి

అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల అగ్రగామి సంస్థ టెస్లా మన దేశంలో గుజరాత్‌లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. 2024 జనవరిలో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రకటించే అవకాశం ఉంది. ఎగుమతి చేసేందుకు గుజరాత్ సరైన ప్రాంతంగా టెస్లా గుర్తించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. మన దేశంలో 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గతంలో ప్రకటించారు. ప్లాంట్ ఏర్పాటైన తరువాత రెండు సంవత్సరాల పాటు దిగుమతి చేసుకునే వాహనాలపై 15 శాతం మాత్రమే దిగుమతి సుంకాలు విధించాలని ఎలాన్ మస్క్ కోరారు.