ఎలాన్ మస్క్ ఆరోపణలకు… విల్ క్యాత్‌కార్ట్ కౌంటర్!

ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్ ప్రతీ రాత్రి యూజర్ డేటాను ఎక్స్‌పోర్ట్ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొనడం చర్చనీయాంశమయ్యింది. వీటిని వాట్సప్ అధినేత విల్ క్యాత్‍కార్ట్ తోసిపుచ్చారు. ఆయన వాదన అవాస్తవమన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది చెప్పారని, మళ్లీ పునరావృతం చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రతీ రాత్రి మీ యూజర్ డేటాను వాట్సప్ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. అయినప్పటికీ అది సురక్షితమేనని కొంతమంది భావిస్తున్నారు అని ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై వాట్సప్ అధినేత విల్ క్యాత్‍కార్ట్ దీటుగా స్పందిస్తూ..ఇప్పటికే చాలామంది ఇదే విషయాన్ని చెప్పారు. కానీ, దీన్నే పునరావృతం చేయడం వల్ల ఉపయోగం లేదు. భద్రతా అంశాన్ని వ్సాప్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకే మీ మెసేజ్‍లను ఎండ్-టు-ఎండ్ ఎన్‍క్రిప్ట్ చేస్తాం. ప్రతీ రాత్రి అవి మాకు చేరవు లేదా ఎక్స్‌పోర్ట్ కావు. మీ మెసేజ్‍లను బ్యాకప్ చేయొద్దు అనుకుంటే, మీ క్లౌడ్ ప్రొవైడర్‍ను వినియోగించుకోవచ్చు. దానికి కూడా ఎండ్-టు ఎండ్ ఎన్‍క్రిప్షన్ ఉంటుంది అని వాట్సప్ చీఫ్ స్పష్టం చేశారు.