Macrohard: మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మ్యాక్రోహార్డ్

సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ (Microsoft)ను తలదన్నేలా అధునాతన కృత్రిమమేధ సంస్థ మాక్రోహార్డ్ (Macrohard) ను ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ పేరులోని మైక్రో, సాఫ్ట్ పదాలకు పూర్తి విరుద్ధమైన మాక్రో, హార్డ్ పదాలతో మస్క్ తన కొత్త కంపెనీకి పేరు పెట్టడం గమనార్హం. సూత్రప్రాయంగా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భౌతిక హార్డ్‌వేర్‌ను తయారు చేయవని, వాటిని కృత్రిమ మేధతో పూర్తిగా సిమ్యులేట్ చేయడం సాధ్యం కావాలని చెప్పారు. మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ ఈ నెల 1న మ్యాక్రోహార్డ్ పేటెంట్ కోసం దరఖాస్తును యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌కు సమర్పించింది. ఏఐ (AI) ఫోకస్డ్ సర్వీసులను ఈ కంపెనీ ద్వారా అందజేయనున్నట్లు తెలిపింది.