ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన!
ట్విటర్ కొనుగోలుకు సంబంధించి టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ మరోసారి కీలక ప్రకటన చేశారు. 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్‌ను అతి త్వరలోనే పూర్తి చేయనున్నారట. ట్విటర్ కొనుగోలుకు సంబంధిత నిధులు సమకూర్చుకుంటున్న మస్క్ శుక్రవారం నాటికి కొనుగోలును పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు సహ పెట్టుబడిదారులకు మస్క్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీల్‌కు నిధులు సమకూర్చే బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కాల్లో ట్విటర్ కొనుగోలు డీల్‌ను త్వరలోనే ముగించాలని మస్క్ నిర్ణయించినట్లు వార్త లొచ్చాయి. ముఖ్యంగా సీక్వోయా క్యాపిటల్, బినాన్స్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఇతరులతో సహా ఈక్విటీ పెట్టుబడిదారులు మస్క్ లాయర్ల నుండి పైనాన్సింగ్ కమిట్మెంట్కు సంబంధించిన పత్రాలను అందుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.






