ఈకామ్ ఎక్స్ప్రెస్ తీపి కబురు
కరోనా సంక్షోభ సమయంలో ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ఈకామ్ ఎక్స్ప్రెస్ఎ తీపి కబురు చెప్పింది. 7000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టెక్నాలజీ-ఎనేబుల్డ్ ఎండ్ టు- ఎండ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఈకామ్ ఎక్స్ప్రెస్ ప్రకటించింది. రాబోయే రెండు నెలల్లో లాస్ట్-మైల్ డెలివరీ, గిడ్డంగుల నిర్వహణ, కార్యకలాపాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్సెస్ విభాగాల్లో పూర్తి సమయం ఉద్యోగులుగా ఈ నియామకాలుంటాయని ఈకామ్ ఎక్స్ప్రెస్ తెలిపింది. అంతేకాదు రానున్న పండుగ సీజన్ నాటికి ఆన్లైన్ షాపింగ్, డోర్స్టెప్ డెలివరీలకు ప్రాధాన్యతనిచ్చేలా దాదాపు 3500 మంది ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలను కూడా రూపొందించింది.






