అమెరికా విపణిలోకి డాక్టర్ రెడ్డీస్ ఔషధం
పలు రకాల కేన్సర్ చికిత్సల్లో వినియోగించే లెనలిడోమైడ్ క్యాప్సూళ్లను పరిమిత పరిమాణంలో (2.5 ఎమ్జీ, 20 ఎమ్జీ మోతాదుల్లో) అమెరికా విపణిలో ఆవిష్కరించడానికి డాక్టర్ రెడ్డీస్‌కు అమెరికా ఔషద నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులు దక్కాయి. లెనలిడోమైడ్ క్యాప్సూళ్లలోని ఆరు మోతాదుల్లో రెండిరటిని తొలి సారిగా ఈ మార్కెట్లోకి ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ సీఈవో (నార్త్ అమెరికా జనరిక్స్) మార్క్ కికుచి పేర్కొన్నారు. ఇక పరిమాణంతో సంబంధం లేకుండా జనవరి 31, 2026 నుంచి అమెరికాలో విక్రయించడానికి సైతం లైసెన్సులు పొందింది.






