యూఎస్ మార్కెట్లో ఈ ఏడాది 25 ఉత్పత్తులు : డాక్టర్ రెడ్డీస్
ఈ ఆర్థిక సంవత్సరంలో యూఎస్ మార్కెట్లో 25 ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామని ఔషధ తయారీ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రకటించింది. ఈ ఏడాది వేర్వేరు ప్రాజెక్టులు నిర్వహించేందుకు రూ.1000 కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయిస్తున్నట్టు కంపెనీ సీఈవో ఇరెజ్ ఇస్రాయిలీ వెల్లడించారు. 2019-20లో మొత్తం 27 ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. అందులో కొన్ని పున ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఈ ఏడాది కూడా విధానం కొనసాగుతుందని భావిస్తున్నాం. మొత్తం 25 ఔషధాలను ప్రవేశపెట్టవచ్చునని అంచనా వేస్తున్నామని వివరించారు.






