2 నిమిషాల కాల్ తో 200మందికి ఉద్వాసన

అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఫ్రంట్ కొత్త ఏడాదిలో ఉద్యోగుల తొలగింపును ప్రారంభించింది. కేవలం రెండు నిమిషాల వర్చువల్ కాల్‌లో కంపెనీకి చెందిన 200 మందిని తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో పూర్తికాల, పార్ట్ టైం, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు టెక్ క్రంచ్ వెల్లడించింది. ఈ సమావేశంలో సీఈవో జెస్సీ డీపింటో తన రెండు నిమిషాల ప్రసంగంలో సంస్థ ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దివాలాకు బదులుగా చేపడుతున్న ప్రత్యామ్నాయాలు వివరిస్తూ తప్పనిసరి పరిస్థితులో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు 2017లో ప్రారంభమైన ఫ్రంట్ టెక్ అమెరికాలోని అతి ఖరీదైన వెయ్యి అపార్ట్‌మెంట్‌ల నిర్వహణ బాధ్యతను చూస్తుంది. అయితే అద్దె వసూలు విషయంలో ఏర్పడిన ఇబ్బందులతో సంస్థ ఆర్థికంగా చిక్కులో పడింది.