60 ఏళ్లలో ఎన్నడూ లేనంత… అతి తక్కువ స్థాయికి
అసలే కొవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన చైనాకు గోరుచుట్టుపై రోకటి పోటులా తీవ్ర అనావృష్టి వచ్చిపడింది. వర్షాలు ముఖం చాటేడయంతో వేసవి ఎండలు మండిపోతున్నాయి. చైనాలో వర్షపాతం గడచిన 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత అతి తక్కువ స్థాయికి పడిపోయింది. ఆసియాలోని అతిపెద్ద నదుల్లో ఒకటైన యాంగ్జే సగానికి సగం చిక్కిపోయింది. అనావృష్టితో నదులు ఎండిపోవడం జలవిద్యుత్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. కర్మాగారాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయి, పారిశ్రామికోత్పత్తి, దెబ్బతింటోంది. తాగునీటికి, సాగునీటికి కటకట ఏర్పడింది. 2020లో 5.5శాతం వృద్ధిరేటును సాధించాలనుకున్న డ్రాగన్ ఈ ఏడాది ప్రథమార్థంలో అందులో సగం రేటుతోనే సరిపెట్టావాల్సి వచ్చింది.






