అమెరికాకు చైనా షాక్.. ఆయుధ కంపెనీలపై

అమెరికాకు చెందిన ఐదు ఆయుధ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఫలితంగా ఆ సంస్థలకు చైనాలో ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని స్తంభింపచేస్తారు. అలాగే చైనాలోని వ్యక్తులు, సంస్థలు ఆ కంపెనీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. తైవాన్‌కు ఆయుధాలను విక్రయించడం, చైనా కంపెనీలు, వ్యక్తులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలకు అగ్రరాజ్యం దిగిన నేపథ్యంలో డ్రాగాన్ ఈ మేరకు స్పందించింది. బీఏఈ సిస్టమ్స్ ల్యాండ్ అండ్ ఆర్మమెంట్స్, ఎలియన్ టెక్‌సిస్టమ్స్ ఆపరేషన్స్, ఏరోవిరోన్ మెంట్, వయాశాట్ అండ్ డేటా లింక్ సొల్యూషన్స్‌పై కొరడా రaళిపించింది. తాజాగా ఆంక్షల ప్రభావం ఏ మేరకు ఉంటుదన్న దానిపై స్పష్టత లేదు. చాలావరకూ డ్రాగన్ తీసుకునే ఇలాంటి చర్యల ఫలితం శూన్యమేన్న వాదన వినిపిస్తోంది. అమెరికా ఆయుధ సంస్థలు చైనాకు ఆయుధాలు విక్రయించకపోవడమే ఇందుకు కారణం.