Donald Trump: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఇప్పుడే అంచనావేయలేం : నాగేశ్వరన్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )విధించిన టారిఫ్‌ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనావేయడం తొందరపాటు చర్య అని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత నాగేశ్వరన్ (Nageswaran) వెల్లడిరచారు. ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాలు ఏమీ కనిపించలేదని చెప్పారు. ఈ ఏడాదికి భారత ఆర్థిక వ్యవస్థ 6.3 నుంచి 6.8 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని అంచనా వేశారు. దేశంలోని రాజకీయ స్థిరత, భారీ మార్కెట్ అవకాశాలు, బలమైన లేబర్‌మార్కెట్, స్థిరంగా పెరుగుతున్న ఆర్థిక వృద్ధి వంటి అంశాలను పరిశీలిస్తే, తయారీ సంస్థల ఏర్పాటుకు అత్యుత్తమ ప్రదేశమన్నారు. భారత్ (India) సెమీకండెక్టర్లు, కృత్రిమ మేధ రంగంలో పోటీ పడేందుకు కీలక చర్యలు తీసుకొంటోందని నాగేశ్వరన్ పేర్కొన్నారు. ముంబయి (Mumbai)లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.