గూగుల్‌కు మరోసారి భారీ జరిమానా
గూగుల్‌కు భారత ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏకంగా రూ.936.44 కోట్ల జరిమానాను విధించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇది గూగుల్‌కు రెండవ జరిమానా కావడం గమనార్హం. గూగుల్ మార్కెట్లో ఉన్న తన స్థానాన్ని ఉపయోగించుకుని తన చెల్లింపుల యాప్‌ను, యాప్‌లలో చెల్లింపుల వ్యవస్థను ప్రచారం చేసుకుంటోందని సీసీఐ ఇటీవల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం రూ.1337.76 కోట్లు, తాజాగా 936 కోట్లు జరిమానాను విధించింది. దీంతో గూగుల్ భారత్‌కు చెల్లించాల్సిన మొత్తం జరిమానా విలువ రూ.2274 కోట్లకు చేరింది.






