బ్రూక్ ఫీల్డ్ చేతికి అమెరికన్ టవర్స్ బిజినెస్

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ భారత్‌లోని అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ఏటీసీ) వ్యాపారాన్ని చేజిక్కించుకుంటున్నది. గత ఏడాది అక్టోబర్ 1న నుంచి టికింగ్ ఫీతో కలిసి ఏటీసీ ఇండియా విలువను 2 బిలియన్ డాలర్లు (రూ.16,500 కోట్లు) గా పరిగణించి జరుగుతున్న ఈ మెగా డీల్ మొత్తం వాల్యూ దాదాపు రూ.21 వేల కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) కావడం విశేషం. ఇక నగదు లాలాదేవీల్లో జరుగబోయే ఈ డీల్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ముగిసే వీలున్నది. 100 శాతం ఏటీసీ ఇండియాని సొంతం చేసుకోవడానికి సంబంధించి ఓ ఒప్పందం కుదిరింది అని బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అయిన డాటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ (డీఐటీ) తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ప్రముఖ టెలికం మౌలిక సదుపాయాల కల్పన సంస్థగా ఉన్న ఏటీసీ సదుపాయాల కల్పన సంస్థగా ఉన్న ఏటీసీ ఇండియాకు దేశవ్యాప్తంగా దాదాపు 78,000 టవర్లున్నారు. బ్రూక్‌ఫీల్డ్‌కూ దాదాపు 1,75,00 టవర్లున్నాయి. 2020లో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి దక్కించుకున్న సంగతి విదితమే.