భారత్కు ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ : అమెరికా
భారత్కు అత్యాధునిక ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ (బ్లాక్-3) యుద్ధ విమానాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా వైమానిక దిగ్గజ సంస్థ బోయింగ్ వెల్లడించింది. భారత నావికా దళ అవసరాలకు ఈ జెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపింది. ముఖ్యంగా సెప్టెంబర్ 2 నుంచి అందుబాటులోకి రానున్న ఐఎన్ఎస్ విక్రాంత్ విమానవాహక నౌక మీద సన్నద్ధంగా ఉంచడానికి చక్కగా అమరుతాయని కంపెనీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ కీలక ప్రకటన చేశారు. తమ ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ (బ్లాక్-3) యుద్ధ విమానాలను ఎంపిక చేస్తే ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమానికి చేయతనందిస్తామన్నారు. విడిభాగాల తయారీని, పరిశోధన అభివృద్ధిని ఇక్కడే చేపడతామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల (360 కోట్ల డాలర్ల) మేర పెట్టుబడులు దేశ రక్షణ ఉత్పత్తుల రంగంలోకి వస్తాయని వివరించారు.






