లండన్‌లో మాయమైన బెంట్లీ కారు.. పాకిస్థాన్ లో ప్రత్యక్షమైంది
కొద్ది వారాల క్రితం లండన్‌లో చోరికి గురైన సూపర్ లగ్జరీ బెంట్లీ కారు పాకిస్థాన్‌లోని కరాచీలో ప్రత్యక్షమైంది. సుమారు 3 లక్షల డాలర్ల ఖరీదైన అత్యంత లగ్జరీ బెంట్లీ కారు లండన్‌లో చోరికి గురైంది. దీంతో రంగంలోకి దిగిన యుకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ కారులోని అడ్వాన్స్ ట్రాకింగ్ ట్రాకర్ ద్వారా లొకేసన్ గుర్తించింది. కరాచీలో కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కలెక్టరేట్‌కు బెంట్లీ మ్యుల్సాననే సెడన్ కారు అడ్రస్‌ను ఇవ్వడంతో అధికారులు సరాసరి కారున్న బంగ్లా వద్దకు వెళ్లి రికవరీ చేశారు. బెంట్లీ కారుపై పాకిస్థాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేటును అధికారులు గుర్తించారు.
యూకే అధికారులు సమర్పించిన ఆధారాలలతో కారు సరి పోవడంతో అదే చోరికి గురైన బెంట్లీ కారుగా నిర్ధారించారు. వాహనం ఉన్న ఇంటి యజమాని కారు డాక్యుమెంట్లను సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో, ఆ వ్యక్తితో పాటు కారు అమ్మిన బ్రోకర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ చోరీ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారును పాకిస్థాన్‌కు దిగుమతి చేయడానికి అత్యున్నత స్థాయి దౌత్యవేత్త డాక్యుమెంట్ల ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.






