Aurobindo :అరబిందో ఔషధానికి అమెరికాలో అనుమతి

రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఔషధం రివారోక్జాబాన్ (Rivaroxaban) ట్యాబెట్లను 2.5 ఎంజీ డోసులో తయారు చేసి, అమెరికా (America) లో విక్రయించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ (USFDA) అనుమతులు లభించినట్లు అరబిందో ఫార్మా (Aurobindo Pharma) తెలిపింది. జాన్సెన్ ఫార్మా బ్రాండెడ్ ఔషధమైన గ్జారెల్టోకు జనరిక్ రూపమే ఇది. ఈ త్రైమాసికంలోనే ఈ మందును అమెరికాలో ప్రవేశ పెడతామని అరబిందో తెలిపారు. గత ఏడాది కాలంలో అమెరికాలో ఈ ఔషధ అమ్మకాలు 447 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.3,900 కోట్ల ) మేర జరిగాయి. రివారోక్జాబాన్ ట్యాబ్లెట్లను 10, 15, 20 ఎంజీ డోసుల్లోనూ విక్రయించేందుకు సూత్రప్రాయ అనుమతులు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి లభించినట్లు అరబిందో ఫార్మా వివరించింది.