అమెరికాలో సిప్లా, గ్లెన్ మార్క్ ఉత్పత్తులు రీకాల్

అమెరికాలో భారత ఫార్మా కంపెనీలు సిప్లా, గ్లెన్‌మార్క్‌లు తమ ఉత్పత్తులను మార్కెట్ నుండి వెనక్కి పిలిచాయి. సిప్లా న్యూజెర్సీకి చెందిన అనుబంధ సంస్థ 59,244 ప్యాక్‌ల ఇప్రాటోపియం బ్రోమైడ్, అల్బుటెరోల్ సల్ఫేట్ ఇన్‌హేలేషన్ సొల్యూషన్‌ను రీకాల్ చేసిందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడినిస్ట్రేషన్ ( యుఎస్‌ఎఫ్‌డిఎ) నివేదించింది. షార్ట్ ఫిల్ కారణంగా సిప్లా యూఎస్‌ఏ ఈ చాలా మందులను రీకాల్ చేసింది. యూఎస్‌ఎఫ్‌డిఎ ప్రకారం ఈ ఔషధాల పౌచ్‌లలో ఔషధ పరిమాణం సూచించిన పరిమితి కంటే తక్కువగా ఉంది. ఇక గ్లెన్‌మార్క్ అమెరికా ఆధారిత బ్రాంచ్ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ తయారీలో కొన్ని లోపాల కారణంగా ఔషధాన్ని ఉపసంహరించుకుంది. ఏప్రిల్ 17 నుండి కంపెనీ రీకాల్‌ను ప్రారంభించింది. యూఎస్‌ఎఫ్‌డిఏ ప్రకారం, రీకాల్ చేసిన డ్రగ్స్ పెద్దగా హాని కలిగించే అవకాశం లేదు.