వాటిని సాయంగా ఇవ్వడం లేదు : అమెరికా
పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాల విడిభాగాలను తాము సాయంగా ఇవ్వడం లేదని అమెరికా ప్రకటించింది. వాటిని పాక్‌కు విక్రయిస్తున్నామని తెలిపింది. గతంలోనే విక్రయించిన ఎఫ్016 యుద్ధ విమానాల నిర్వహణ విధానంలో భాగంగా ఈ విడిభాగాలను విక్రయిస్నున్నట్లు పేర్కొంది. తాము విక్రయించిన వ్యవస్థలు ప్రపంచంలో ఎక్కడా ఉన్నా వాటికి నిర్వహణ సేవలందించడం, విడిభాిగాలకు సంబంధించిన మద్దతివ్వడం తమ విధానమని స్పష్టం చేసింది. పాక్‌కు 450 మిలియన్ డాలర్ల (రూ.3584 కోట్ల) విలువ చేసే ఎఫ్-16 యుద్ధ విమానాల విడిభాగాల విక్రయానికి బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలపడం, దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.






