విమాన ప్రయాణికులకు శుభవార్త

విమాన ప్రయాణికులకు శుభవార్తను అందించింది టాటాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ప్రయాణికులను ఆకట్టుఉనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. దేశీయంగా ప్రారంభమైన విమాన టికెట్ ధరను రూ.1,799 (వన్-వే), అంతర్జాతీయ రూట్‌లో రూ.3,899 గా నిర్ణయించింది. ఈ నెల 5 వరకు మాత్రమే ఈ బుకింగ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబర్ 30లోగా ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని వెల్లడిరచింది. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా జరిగే బుకింగ్‌లపై విధించిన కన్వియెన్స్ ఫీజును పూర్తిగా ఎత్తివేసింది. ఎకానమి క్లాస్ టికెట్ ధరను రూ.1,799గా నిర్ణయించిన సంస్థ.. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.10,899. అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా దేశాలకు సంస్థల విమానాలను నడుపుతున్నది.