విజయవాడ టు షార్జా డైరెక్ట్ ఫ్లయిట్
విజయవాడ-షార్జా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ నెల 31న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ విమాన సర్వీసు ప్రారంభిస్తోంది. ఆ రోజు సాయంత్రం 6:35 గంటలకు విజయవాడ-షార్జా తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. రూ.13,669 ప్రారంభ ధరతో ఈ సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. కాగా షార్జా-విజయవాడ సర్వీసు చార్జీ 399 ఎమిరేట్స్ దిర్హమ్స్ (సుమారు రూ.8,946)గా నిర్ణయించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్రయాణికులకు విజయవాడ`షార్జా డైరెక్ట్ విమాన సర్వీసు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈవో అలోక్ సింగ్ తెలిపారు. షార్జాతో పాటు మస్కట్, కువైట్లకు కూడా తమ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నట్టు ప్రకటించారు.






