భారత్-మలేసియా మధ్య .. 15 లక్షల సీట్లు
మలేసియా, భారత్ మధ్య గణనీయంగా సేవలను పెంచనున్నట్టు ఎయిర్ ఆసియా ప్రకటించింది. రాబోయే 2024 సంవత్సరంలో మొదటి 3 నెల్లలో మొత్తం 69 వీక్లి ఫ్లైట్ల ద్వారా ఏడాదికి 15 లక్షల సీట్లు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ 1 నుంచి భారతదేశం నుంచి మలేషియాలోకి వచ్చే ప్రయాణికులకు 30 రోజుల వీసారహిత ప్రవేశాన్ని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ఎయిర్ ఆసియా తన సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరించడానికి కట్టుబడి ఉంది. వచ్చే ఏడాది మొదటి 3 నెలల్లో ఎయిర్ ఆసియా నుంచి బెంగళూరు, కోల్‌కతా, కొచ్చి, హైదరాబాద్, చెన్నై, తిరుచిరాపల్లి, న్యూఢిల్లీ, అమృత్సర్, త్రివేండ్రం లాంటి భారతదేశంలోని తొమ్మిది గమ్యస్థానాల నుండి కౌలాలంపూర్‌కు వారానికి 69 విమానాలు నడుపుతుంది.






