Apple: 3 రోజులు.. 3 విమానాల్లో అమెరికాకు యాపిల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన ప్రతీకార సుంకాలను తప్పించుకునే లక్ష్యం తో యాపిల్ (Apple) కంపెనీ కేవలం మూడు రోజుల వ్యవధిలో భారత్ (India) నుంచి నిండుగా లోక్ చేసి మూడు విమానాల్లో ఐఫోన్లను అమెరికా తరలించిది. సీనియర్ భారత ప్రభుత్వ అధికారులు ఈ విషయం ధ్రువీకరించారు. ట్రంప్ ప్రభుత్వం 10 శాతం టారిఫ్‌ల ప్రకటన వెలువడడం కన్నా ముందు మార్చి చివరి వారంలో ఈ ఐఫోన్ల తరలింపు జరిగిందన్నారు. అంతేకాదు కొత్త టారిఫ్‌లు అమలులోకి వచ్చినప్పటికీ భారత్‌లో గాని, ఇతర దేశాల మార్కెట్లో గాని తక్షణ చర్యగా ఐఫోన్ల ధరలు పెంచే ఆస్కారం లేదని యాపిల్ స్పష్టం చేసింది. సాంప్రదాయికంగా వస్తు రవాణా పరిశ్రమకు ఇది అంత రద్దీ ఉండని సమయం. అయినప్పటికీ ట్రంప్ చర్యల నేపథ్యంలో చైనా (China), భారతదేశాల్లోని తమ ఫ్యాక్టరీల నుంచి భారీగా యాపిల్ కంపెనీ ఐఫోన్లను తరలించిందని వారు తెలిపారు.