Blair House : బ్లేయర్ హౌస్‌లో ప్రధాని మోదీ బస

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ చేరుకొన్నారు. అక్కడ అధ్యక్షుడు ట్రంప్(Trump), డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మోదీకి భారత సంతతి వారు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రపంచం లోనే అత్యంత ప్రత్యేకమైన అతిథి గృహంలో బస చేస్తున్నారు. 1651 పెన్సిల్వేనియా (Pennsylvania) అవెన్యూలోని బ్లేయర్ హౌస్ (Blair House) ఆయనకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ భవనం శ్వేత సౌధానికి ఎదురగా ఉండటం దీని విశేషం. అమెరికాలో పర్యటించే అత్యంత ప్రత్యేకమైన అతిథులకు ఇక్కడ బస ఏర్పాటు చేశారు. గతంలో చాలా మంది దేశాధ్యక్షులు, రాజకుటుంబ సభ్యులకు దీనిని విడిదిగా వాడారు.