ఇలాంటి దాడులతో తనను అడ్డుకోలేరు : వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న వివేక్ రామస్వామి ఉక్రెయిన్‌పై అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కొందరు ఆయన వాహనంపై దాడికి యత్నించారు. అయోవాలోని గ్రిన్నెల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివేక్ రామస్వామి ఆరోపణలకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈరోజు నిరసనకారులతో నాకు వాగ్వాదం జరిగింది. వారిలో ఇద్దరు నీలి రంగు హోండా సివిక్ కారుతో నా కాన్వాయ్‌లోని ఎస్‌యూవీని ఢీ కొట్టారు. అనంతరం మా సిబ్బందికి అసభ్య సంజ్ఞలు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కారుతో ఢీ కొట్టిన వాళ్లు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు అని వివేక్ రామస్వామి తెలిపారు. ఇలాంటి దాడులతో తనను అడ్డుకోలేరని, తన వైఖరిలో ఎలాంటి మార్పు డండదని వివేక్ వెల్లడించారు.






