Donald Trump: వీసా అర్హతే .. హక్కు కాదు!

అమెరికా వీసా దక్కడం అనేది చట్టబద్ధమైన హక్కు కాదని, అది కేవలం అమెరికాలోకి అడుగుపెట్టేందుకు అర్హత మాత్రమేనని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) ప్రభుత్వం పునరుద్ఘాటించింది. వీసా (Visa) ధరఖాస్తుదారులను హెచ్చరిస్తూ ఇప్పటికే పలు మార్లు పలురకాల అడ్వైజరీ (Advisory)లు జారీ చేసిన ట్రంప్ సర్కార్ తాజాగా మరో ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తుదారుల సామాజికమాధ్యమ ఖాతాలో గత వ్యాఖ్యానాలు, వీడియోలు (Videos), పోస్ట్‌లను జల్లెడపట్టి వెతికిమరీ అప్లికేషన్లను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం తెల్సిందే. తాజాగా వీసా పొంది అమెరికా (America) గడ్డపై అడుగుపెట్టాక చట్టవ్యతి రేక కార్యకలాపాలను ప్పాలడితే వీసాను వెంటనే రద్దుచేసి, బహిష్కరించి బలవంతంగా స్వదేశానికి పంపుతామని ఒక ప్రకటనలో పేర్కొంది.