అక్కడ బలగాలను మోహరింపును కొనసాగిస్తాం : బైడెన్

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బలగాల మోహరింపును కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 100 రోజులవుతున్న నేపథ్యంలో తొలిసారిగా అమెరికా చట్టసభల (కాంగ్రెస్) సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించిన బైడెన్ ప్రసంగించారు. దేశ ఆర్థికాభివృద్ధి, విదేశాంగ విధానం, మౌలిక వసతుల కల్ప, కరోనాపై పోరాటంలో అమెరికా పాత్ర తదితర అంశాలపై మాట్లాడారు. దక్షిణ చైనా సముద్రంపై తమకే సర్వాధికారాలున్నాయంటూ రంకెలేస్తున్న చైనాకు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. ఘర్షణలను ప్రారంభించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. వాటి నివారణే బలగాల మోహరింపు వెనుక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఐరోపాలో నాటో దశాలను కొనసాగిస్తున్నట్లే ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనూ తమ బలగాలను మోహరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‍పింగ్‍కు ఈ ఏడాది జనవరిలోనే తాను స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. శ్వేతజాతి ఆధిపత్యాన్ని దేశీయ ఉగ్రవాదంగా బైడెన్ అభివర్ణించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రతినిదిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఉన్నారు.