కెనడా వాదనకు అమెరికా మద్దతు!
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా దర్యాప్తునకు భారత ప్రభుత్వం సహకరించాలని అమెరికా మురోసారి సూచించింది. ఈ విషయమై ఇప్పటికే బైడెన్ యంత్రాంగం ఢిల్లీలో అధికారులతో పలు సార్లు చర్చించినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహరంలో కెనడాతో తాము సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. భారత్, కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ శాఖ అదికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ను స్పందించారు. దీనిపై మేం మా వైఖరిని గతంలోనే స్పష్టం చెప్పాం. మరోసారి చెబుతున్నాం. ఈ వ్యవహారంపై కెనడాతో మేం నమన్వయం చేసుకుంటున్నాం. కెనడా చేపట్టిన దర్యాప్తునకు భారత ప్రభుత్వం సహకరించాలని మేం పలుమార్లు సూచించాం. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత విదేశాంగ మంత్రితో జరిపిన సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు అని తెలిపారు.






