Donald Trump : త్వరలో భారత్ -చైనాపై పరస్పర సుంకాలు

భారత్, చైనా వంటి దేశాలపై త్వరలో పరస్పర సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పారు. గతవారం ప్రధాని మోదీ (Modi) అమెరికా పర్యటన సందర్భంగా తాను చెప్పిన విషయాన్ని వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పునరుద్ఘాటించారు. ఏ కంపెనీ అయినా, ఏ దేశమైనా అమెరికా వస్తువులపై ఎంతెంత సుంకాలు విధిస్తున్నాయో తాము కూడా అదే స్థాయిలో సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. కొత్తగా పదవిలోకి వచ్చిన హోవార్డ్ దీనికి బాధ్యత వహించబోతున్నారని తెలిపారు. తాము న్యాయంగా ఉండాలని భావిస్తున్నామని, అందుకే పరస్పరం అంటున్నామని చెప్పారు.