ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధం చెల్లదు
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తుపాకీ ఉపకరణాల్లో ఒకటైన బంప్స్టాక్స్పై విధించిన నిషేధాన్ని అమెరికా సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సెమీ ఆటోమేటిక్ తుపాకీకి బంప్స్టాక్స్ను అమరిస్తే, మెషిన్‌గన్‌లా వాడే వీలుంటుంది. 2017లో లాస్‌వెగాస్‌లో జరిగిన సంగీత ఉత్సవంపై ఓ గన్‌మన్ బంప్స్టాక్స్ అమర్చిన తుపాకీతో కాల్పులు జరిపాడు. 11 నిమిషాల్లో 1000 రౌండ్లు కాల్చాడు. 60 మంది చనిపోయారు. దీంతో 2018లో బంప్స్టాక్స్పై ట్రంప్ ప్రభుత్వం నిషేధించింది. దీన్ని టెక్సాస్‌కు చెందిన వ్యక్తి సవాల్ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు మెషిన్గన్ల నిషేధం కోసం వందేళ్ల క్రితం రూపొందించిన చట్టం పరిధిలోకి బంప్స్టాక్స్ రావని, కాబట్టి నిషేధం చెల్లుబాటు కాదని పేర్కొంది.






