Hamas : హమాస్‌ను నిర్మూలించాల్సిందే : రుబియో కీలక వ్యాఖ్యలు

హమాస్‌ను గాజా నుంచి తుడిచిపెట్టాల్సిందేనని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో (Mark Rubio) స్పష్టం చేశారు. సైనికపరమైన లేదా ప్రభుత్వాన్ని నడిపే శక్తిగా హమాస్ ఎంతమాత్రం కొనసాగనివ్వబోమని చెప్పారు. ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ(Netanyahu) తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంగా, పరిపాలనా శక్తిగా, హింసకు పాల్పడతామంటూ బెదిరించే వ్యవస్థగా హమాస్ ఉన్నంతకాలం శాంతి నెలకొనడం అసాధ్యం. అందుకే హమాస్‌ను నిర్మూలించకప్పదు అని కుండబద్దలు కొట్టారు. హమాస్‌పై పోరుకు అరబ్ దేశాల (Arab countries) సాయం కూడా కోరుతామన్నారు. ఎవరూ ముందుకు రాకుంటే సొంతంగా ఇజ్రాయెలే (Israel) ఆపని పూర్తి చేస్తుందని చెప్పారు.