భారత్ లో అమెరికా తాత్కాలిక రాయబారిగా డేనియల్ స్మిత్

అమెరికా ఉన్నత స్థాయి దౌత్యాధికారి డేనియల్ స్మిత్‍ను భారత్‍కు తాత్కాలిక రాయబారిగా నియమిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం రాయబారి నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం ఉంటుంది. ఈ పక్రియ అంతా పూర్తి కావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం భారత్‍లో కరోనా సంక్షోభ పరిస్థితులు ఏర్పడటం, ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు, సహకారం కొనసాగించాల్సిన అవసరం ఏర్పడటంతో బైడెన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జనవరి 20వ తేదీ నుంచి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.