మరో భారత సంతతి వ్యక్తి కీలక పదవి….

అమెరికా పాలన యంత్రాంగంలో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఎంతో మంది కీలక పదవులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారత సంతతి వ్యక్తిని మరో కీలక పదవికి నామినేట్ చేశారు. ఇండో-అమెరికన్ అరుణ్ వెంకటరామన్‍ను అమెరికా, విదేశీ వాణిజ్య సేవల డైరెక్టర్ జనరల్‍గా బైడెన్ నామినేట్ చేశారని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి సంబంధించి శ్వేత సౌధం ఒక ప్రకటన చేసింది. అలాగే గ్లోబల్ మార్కెట్స్ అసిస్టెంట్ సెక్రటరీగానూ వెంకటరామన్‍ను నియమించే యోచనలో బైడెన్ ఉన్నట్లు సమాచారం.
గత 20 ఏళ్లుగా ఎన్నో కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సమస్యలపై అమెరికా ప్రభుత్వానికి వెంకటరామన్ సలహాదారుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా వాణిజ్య కార్యదర్శికి కౌన్సిలర్‍గా, వాణిజ్య విభాగానికి మరియు ఇతర అంతర్జాతీయ ఆర్థిక విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు వీసా విభాగంలో వెంకటరామన్ సీనియర్ డైరెక్టర్‍గా విధులు నిర్వహించారు.